Penchalakona: పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం!

Penchalakona: పెంచలకోన పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 April 2026 8:57 PM IST
Penchalakona
X

Penchalakona: పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం!

Penchalakona: నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ను వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశి ఆహ్వాన పత్రికను అందజేశి బ్రహోత్సవాలకు, విచ్చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానించారు.

పెంచలకోన దేవస్థాన ఆలయ వేద పండితులు ముఖ్యమంత్రి కి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం పలికారు.స్వామి వారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..

ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే పెంచలకోన బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం సంతోషంగా ఉందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.​ ఈ కార్యక్రమంలో పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి ఫెస్టివల్ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story