Penchalakona: భక్తులతో పోటెత్తిన పెనుశిల లక్ష్మి నృసింహ స్వామి ఆలయం!

Penchalakona: ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నృసింహ స్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది.

Yellayya, Nellore
Published on: 11 July 2026 11:38 PM IST
Penchalakona
X

Penchalakona: భక్తులతో పోటెత్తిన పెనుశిల లక్ష్మి నృసింహ స్వామి ఆలయం!

పెంచలకోన: ​ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాపూరు మండలం పెంచలకోనలో వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మి నృసింహ స్వామి ఆలయం శనివారం నాడు భక్తజన సందోహంతో పోటెత్తింది. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా అభిషేకాలు,నయనానందకరంగా కల్యాణోత్సవం.భక్తులు సమర్పించిన 100 గొడుగులతో శ్రీ చెంచులక్ష్మి, శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీ నరసింహ స్వామి వారికి తిరుచ్ఛి సేవ.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, గిరిజనుల సాంప్రదాయ వాయిద్యాల నడుమ స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ భక్తులను మంత్రముగ్ధులను చేసింది.ఈ విశేష పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పెంచలకోన పుణ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలను తలపించింది. భక్తులంతా స్వామి, అమ్మవార్ల కృపాకటాక్షాల కోసం సుదీర్ఘ క్యూలైన్లలో వేచి ఉండి దర్శించుకున్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore

Next Story