Nellore: కలువాయిలో భూకబ్జా కోరల నుండి కాపాడండి నూకనపల్లి రైతుల వేడుకోలు!

Nellore: నూకనపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ వారసత్వ భూమిని కబ్జాదారుడి నుంచి కాపాడాలని రెవెన్యూ అధికారులకు, మీడియాకు మొరపెట్టుకున్నారు.

Madhav Goud, Nellore
Published on: 12 Aug 2026 4:27 PM IST
Nellore
X

Nellore: కలువాయిలో భూకబ్జా కోరల నుండి కాపాడండి నూకనపల్లి రైతుల వేడుకోలు!

Nellore: మాకు వారసత్వంగా వచ్చిన భూములను కబ్జా దారులనుండి కాపాడాలని కలువాయి మండలం నూకనపల్లి గ్రామానికి చెందిన రాపూరు దశరదరామిరెడ్డి, చల్లా జయరామిరెడ్డి,దేశిరెడ్డి నరసింహారెడ్డి, మీడియా ముఖంగా అధికారులు వేడుకున్నారు, ఈ సందర్బంగా వారు స్థానిక రెవిన్యూ కార్యాలయంలో ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ నూకనపల్లి గ్రామ సర్వే నెంబర్ 5 లో మాకు వంశపారంపర్యంగా వచ్చిన 8ఎకరాల 46 సెంట్లు భూమి ఉమ్మడిగా వున్నది,రాపూరు దశరద రామిరెడ్డి,షేక్ మస్తాన్ కు 41సెంట్ల భూమిని అమ్మగా...మరో వ్యక్తి వద్ద 20 సెంట్లు భూమి ని అగ్రిమెంట్ ద్వారా మస్తాన్ కొనుగోలు చేసుకొన్నాడు.

కానీ మస్తాన్ మొత్తం భూమి తన పేరు న రెవెన్యూ రికార్డ్ లలో తారు మారు చేసి ఆక్రమించు కొనుటకు ప్రయత్నిస్తున్నాడని వాపోయారు.,రైతులు వారి భూమిని పంట సాగు కోసం అదే గ్రామానికి చెందిన బిల్లుపాటి పెంచలయ్యకు లీజుకు ఇచ్చారు. కౌలు దారుడు పెంచలయ్య తన కొడుకు రవీందర్ ను తీసుకొని పొలంలోకి వెళ్లే సమయంలో షేక్ మస్తాన్, అతని కొడుకు మారణాయుదాలతో కౌలు దారుడు పై దాడి చేసి గాయ పరిచారు.

ఈ విషయమై కలువాయి పోలీస్ లు కేసులు నమోదు చేశారు, హక్కుదారులు ఆ భూమిలో మొక్కలు నాటేందుకు పోలీస్ ల సహకారంతో జామాయిల్ మొక్కలను నాటారు, మరలా అతను కుల సంఘం ద్వారా మరల భూమి తనదని తనకు చెందే విధంగా రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు, ఈ విషయం పై మేము జిల్లా అధికారులనుv కలిసి పిర్యాదు చేసామన్నారు, గతంలో రెవిన్యూ అధికారులు రికార్డ్ లు తారుమారు చేశారని తెలిపారు,రెవిన్యూ అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story