Nellore: ఎల్‌ఈడీ వ్యాన్ ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం!
Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏపీశాక్స్ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ వ్యాన్ ద్వారా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన ప్రచారం నిర్వహించారు.
Nellore: ఎల్‌ఈడీ వ్యాన్ ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం!
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపీఎస్‌ఏసీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎల్‌ఈడీ వ్యాన్ ద్వారా ప్రజలకు హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఏ విధంగా సంక్రమించదనే అంశాలను ప్రజలకు వివరించారు. హెచ్‌ఐవీ ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారిని సమాజంలో భాగస్వాములుగా చూడాల్సిన ఆవశ్యకతను వివరించారు.
హెచ్‌ఐవీకి క్షయ వ్యాధికి ఉన్న సంబంధం, లైంగిక వ్యాధులు,వాటికి అందుబాటులో ఉన్న చికిత్స, కండోమ్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఏపీఎస్‌ఏసీఎస్ యాప్, హెచ్‌ఐవీ సంబంధిత సేవలు, సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1097ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్మయి, ఆసుపత్రి సిబ్బంది, సార్డ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ జె. రూత్ బేనోమి, సునంద, కవిత, సుగుణ, ఉమ, అనూష, మోబినా తదితరులు పాల్గొన్నారు.




