Udayagiri: ఉదయగిరిలో చిరుతపులి పంజా.. రోడ్డుపై ప్రయాణికుల పరుగులు!
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మళ్ళీ చిరుత కలకలం. గండిపాలెం రోడ్డు వద్ద ప్రయాణికులపైకి దూసుకొచ్చిన చిరుతపులి.
Udayagiri: ఉదయగిరిలో చిరుతపులి పంజా.. రోడ్డుపై ప్రయాణికుల పరుగులు!
నెల్లూరు జిల్లా: ఉదయగిరి పట్టణంలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. జాతీయ రహదారి-165 BG గండిపాలెం రోడ్డు సర్కిల్, చెంచురామయ్య నగర్ సమీపంలో ప్రయాణికులపైకి ఒక్కసారిగా చిరుత దూసుకొచ్చిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, పాదచారులు చిరుతను చూసి భయంతో పరుగులు తీశారు.గతంలో ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అటవీశాఖ అధికారులు, పోలీసులు ఉదయగిరి పరిసర గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు.
రాత్రి వేళల్లో బయటకు రావద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచనలు జారీ చేశారు.తాజాగా చిరుత నేరుగా రోడ్డుపైకి వచ్చి ప్రయాణికుల వైపు దూసుకెళ్లడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనావాసాల్లోకి వన్యప్రాణులు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు ప్రయాణికులు సమాచారం ఇచ్చారు.




