Nellore: రాపూరులో నిరుపయోగంగా పోలీస్ క్వార్టర్స్ స్థలం!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు నడిబొడ్డున నిరుపయోగంగా మారిన పోలీస్ క్వార్టర్స్ స్థలాన్ని వాణిజ్య సముదాయంగా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Nellore: రాపూరులో నిరుపయోగంగా పోలీస్ క్వార్టర్స్ స్థలం!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు నడిబొడ్డున ప్రధాన రహదారి పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణం ప్రస్తుతం నిరుపయోగంగా మారి పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. ఒకప్పుడు పోలీసుల నివాసంగా ఉన్న ఈ భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో విలువైన ప్రభుత్వ స్థలం వృథాగా పడి ఉంది. ఈ స్థలాన్ని వాణిజ్యపరంగా మార్చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలాన్ని వ్యాపార సముదాయంగా లేదా ఓపెన్ స్పేస్‌గా మారిస్తే ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్‌లు తగ్గడమే కాకుండా, స్థానిక నిరుద్యోగులు, చిన్న తరహా వ్యాపారులకు దుకాణాలు కేటాయిస్తే అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లీజు పద్ధతిలో కేటాయించడం ద్వారా పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌కు లేదా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరె అవకాశం ఉంది.
గతంలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ దీనిని వ్యాపార సముదాయంగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, ఆయన బదిలీతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ స్థలాన్ని వాణిజ్య వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు, వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.




