Sangam: జాతీయ రహదారిపై లారీ బీభత్సం.. బస్సు ప్రయాణికులు సురక్షితం!

Sangam: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 6 May 2026 1:36 PM IST
Sangam
X

Sangam: జాతీయ రహదారిపై లారీ బీభత్సం.. బస్సు ప్రయాణికులు సురక్షితం!

సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనిగిరి నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజేష్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మిగతా ప్రయాణికులను సురక్షితంగా వేరొక బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story