Nellore: నెల్లూరులో ఘనంగా జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశం!

Nellore: నెల్లూరులో ఘనంగా మాదిగల ఆత్మీయ సమావేశం.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

A Praveen, Nellore
Published on: 17 Sept 2026 1:50 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశం!

Nellore: నెల్లూరులో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశం విజయవంతమైంది. నగరంతో పాటు మాదిగ పల్లెల నుంచి పెద్ద సంఖ్యలో మాదిగలు తరలివచ్చి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు, ప్రతినిధులు ముఖ్య అతిథుల దృష్టికి తీసుకెళ్లారు. మాదిగల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పందిటి సుబ్బయ్య మాదిగ డిమాండ్ చేశారు. మాదిగల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

అలాగే నెల్లూరు నగరంలో మాదిగలు, డప్పు కళాకారుల కోసం ప్రత్యేకంగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. మాదిగల ఐక్యత, సమస్యల పరిష్కారం, హక్కుల సాధనపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore