Nellore: నార్త్ రాజుపాలెంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చద్ది మహోత్సవం!

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చద్ది మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 26 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)
Published on: 25 Aug 2026 11:15 AM IST
Nellore
X

Nellore: నార్త్ రాజుపాలెంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చద్ది మహోత్సవం!

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో వెలసిఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా మూడవ మంగళవారం చద్ది మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు చద్దిని కుండల్లో పెట్టి ప్రత్యేకంగా అలంకరించి, తప్పెట్లు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చద్దిని గ్రామస్తులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్లుగా మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 2015లో దేవస్థానాన్ని పునర్నిర్మించి మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ నెల 26న పూజా కార్యక్రమాలు, 27న హోమాలు, ప్రత్యేక పూజలతో పాటు సినీ గాయకుల పాటకచేరి, 28న మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి పోచం రెడ్డి దిలీప్ రెడ్డి మంది పాటి రమణారెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)

K.Sriharibabu, Kovur (Nellore Dsct)

Next Story