Nellore: రాచర్లపాడులో ఏర్పాట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రంగంలోకి దగుమాటి!
Nellore: నెల్లూరు రాచర్లపాడులో జరగనున్న టిడిపి మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమీక్షించారు.
Nellore: రాచర్లపాడులో ఏర్పాట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రంగంలోకి దగుమాటి!
నెల్లూరు జిల్లా: రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాయి.ఈ నేపథ్యంలో బుధవారం మహానాడు ప్రాంగణం వద్ద నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొనటానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శాలువాతో ఘనంగా సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహానాడు ఏర్పాట్లు,సభా ప్రాంగణ నిర్మాణం,పార్కింగ్,తాగునీరు, భద్రత తదితర అంశాలపై నాయకులు సమీక్ష నిర్వహించారు.రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




