Nellore: నెల్లూరులో మహానాడు పనులు ప్రారంభం!

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఇఫ్కో సెజ్ లో మహానాడు పనులకు భూమి పూజ.

V. Narasimhulu, Nellore
Published on: 6 May 2026 3:11 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో మహానాడు పనులు ప్రారంభం!

Nellore: కొడవలూరు (మం) చంద్రశేఖర పురం ఇఫ్కో కిసాన్ సెజ్ లో భూమి పూజతో మహానాడు వేదిక పనులు ప్రారంభించారు తెలుగుదేశం నాయకులు. ఈనెల 27, 28, 29 మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు కోసం నేడు భూమి పూజలో పాల్గొన్నారు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కురుగొండ్ల,కావ్యకృష్ణారెడ్డి,

కాకర్ల సురేష్, పాశం సునీల్, ఎంఎల్సీ బీదా రవిచంద్ర,, మేయర్ సుజాతా అశోక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరులో తొలిసారిగా మహానాడు జరగనుండడంతో పార్టీ ముఖ్య నేతలు మహానాడు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు టిడిపి నేతలు.

మహానాడు కార్యక్రమానికి సమయం అతి తక్కువగా ఉండడంతో శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది.‌ మూడు రోజులపాటు జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చారిత్రాత్మకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story