Nellore: అరుణాచలం వెళ్తుండగా విషాదం.. నెల్లూరు వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు!

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 April 2026 9:58 AM IST
Nellore
X

Nellore: అరుణాచలం వెళ్తుండగా విషాదం.. నెల్లూరు వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు!

Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్ నుంచి దైవదర్శనఓ కోసం అరుణాచలం వెళ్తున్న ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కమ్మపాలెం వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు అదుపుతప్పి సర్వీస్ రోడ్ పక్కనున్న కలువలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story