Atmakur: ఆత్మకూరులో ఆశా కార్యకర్తల ర్యాలీ

Atmakur: ఆత్మకూరులో వైద్య సిబ్బంది భారీ ర్యాలీ.. ఉచిత రక్త పరీక్షలు, మందులపై హెచ్ఈఓ సుధాకర్ అవగాహన.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 1 Jun 2026 7:31 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో ఆశా కార్యకర్తల ర్యాలీ

ఆత్మకూరు: మలేరియా అధికారి ఎం సింహాచలం జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉండాలని సూచించిన కార్యక్రమంలో భాగంగా ప్రజాఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ (ఆంధ్రప్రదేశ్) ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో జూన్ 01 నుండి 30 వరకు నిర్వహించనున్న ‘మలేరియా నివారణ మాసోత్సవాల’ ను పురస్కరించుకొని సోమవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు.

​"Driven to End Malaria : Now We Can. Now We Must." అనే నినాదంతో సాగిన ఈ ర్యాలీలో వైద్య సిబ్బంది చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, దోమల నివారణ మరియు మలేరియా నిర్మూలనపై ప్రజలకు అర్థమయ్యేలా స్లోగన్స్ ఇస్తూ పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు.​ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (HEO) సుధాకర్ మాట్లాడుతూ:

​ముందస్తు జాగ్రత్తలు: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగునీటి నిల్వల్లో మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ దోమలు పెరుగుతాయని హెచ్చరించారు.

​నివారణ చర్యలు: ఇళ్లలో దోమతెరలు వాడడం, నిల్వ నీటిని క్రమం తప్పకుండా తొలగించడం, అవసరమైన చోట్ల యాంటీ లార్వా స్ప్రే చేయడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చని సూచించారు.

​ఉచిత పరీక్షలు & మందులు: జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో రక్త పరీక్ష చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మలేరియా వ్యాధి నిర్ధారణ మరియు మందులు పూర్తి ఉచితంగా అందించబడుతున్నాయని తెలిపారు.​ఈ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమంలో హెల్త్ విజిటర్ (HV) పార్వతి గారు, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి గారు, స్థానిక యూపీఎస్సీ (UPHC) వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు (ANMs) మరియు ఆశా (ASHA) కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story