Nellore: అట్టహాసంగా “ది రైజింగ్ – సౌండ్స్ ఆఫ్ మంగ్లీ” పోస్టర్ లాంచ్!

Nellore: సెప్టెంబర్ 26న జరగనున్న ప్రముఖ గాయని మంగ్లీ "ది రైజింగ్ – సౌండ్స్ ఆఫ్ మంగ్లీ" మ్యూజిక్ కన్సర్ట్ పోస్టర్‌ను చిల్డ్రన్స్ పార్క్ వద్ద అట్టహాసంగా ఆవిష్కరించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 9 Aug 2026 11:09 PM IST
Nellore
X

Nellore: అట్టహాసంగా “ది రైజింగ్ – సౌండ్స్ ఆఫ్ మంగ్లీ” పోస్టర్ లాంచ్!

నెల్లూరు: సంగీతం.. సందడి.. మంగ్లీ గానం.. నెల్లూరులో ఒక అద్భుతమైన మ్యూజికల్ నైట్‌కు సిద్ధం కండి” అని నిర్వాహకులు పిలుపునిచ్చారు....నెల్లూరు నగరంలో సెప్టెంబర్ 26వ తేదీన జరగనున్న ప్రముఖ గాయని మంగ్లీ “ది రైజింగ్ – సౌండ్స్ ఆఫ్ మంగ్లీ” మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం ఆదివారం నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద అట్టహాసంగా నిర్వహించారు.

ఈ పోస్టర్‌ను కార్యక్రమ నిర్వాహకులు మల్లిక, కోలా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీకృష్ణ హోటల్స్‌ హజరత్ బాబు, నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్ డైరెక్టర్ వినయ్, సింధూరి పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు సంగీతాభిమానులకు మంచి వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 26న “ది రైజింగ్ – సౌండ్స్ ఆఫ్ మంగ్లీ” మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగ్లీ తన అద్భుతమైన గానంతో ప్రేక్షకులను అలరించనున్నారని, కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న అతిథులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకురాలు మల్లిక, కోలా విజయలక్ష్మి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సెప్టెంబర్ 26న జరగబోయే మ్యూజికల్ నైట్‌ను దిగ్విజయం చేయాలని తెలియజేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story