Podili: ఓటర్ల సవరణ ప్రక్రియ 85% పూర్తి మార్కాపురం ఆర్‌డీఓ శివరామిరెడ్డి!

Podili: పొదిలిలో ఓటర్ల నమోదు (SSR) పనితీరుపై మార్కాపురం ఆర్‌డీఓ శివరామిరెడ్డి ఆకస్మిక తనిఖీ. వంద శాతం పూర్తి చేయాలని బీఎల్ఓలకు ఆదేశం.

MADARVALI, MARKAPURAM
Published on: 13 July 2026 10:09 AM IST
Podili
X

Podili: ఓటర్ల సవరణ ప్రక్రియ 85% పూర్తి మార్కాపురం ఆర్‌డీఓ శివరామిరెడ్డి!

Podili: అర్హత ఉన్న ఏ ఒక్క ఓటుకుడా నష్టపొకుండా బిఎల్ఓ,బిల్ఎల సమన్వయంతో పనిచేస్తున్నారని, మార్కాపురం నియోజకవర్గంలో సర్ కార్యక్రమం 85 శాతం పూర్తి అయిందని రేపటిలోగా 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శివరామిరెడ్డి తెలిపారు.

మార్కాపురంజిల్లా పొదిలి పట్టణంలో సర్ కార్యక్రమ పనితీరుపై ఆకస్మికంగా తనిఖి చేశారు. పలుప్రాంతాలను సందర్శించి ఓటర్లతో,బిఎల్ఓలతో‌ ఆయన మాట్లాడారు.

నియోజకవర్గ వర్గంలో 15 శాతం మిగిలిపొయిందని వాటికి కారణాలు అన్వేషించి వాటినికుడా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు బిఎల్ఓ లకు సహకరించాలని ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆవకశాన్ని ఉపయెగించుకొవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎం వి క్రిష్ణారెడ్డి,నగర కమీషనర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story