Marripadu: డీసీపల్లి సర్పంచ్‌గా దేవరాల గంగాధర్ యాదవ్ ఏకగ్రీవం
Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి సర్పంచ్‌గా మండల టీడీపీ కన్వీనర్ దేవరాల గంగాధర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు; మంత్రి ఆనంకు కృతజ్ఞతలు.
Marripadu: డీసీపల్లి సర్పంచ్‌గా దేవరాల గంగాధర్ యాదవ్ ఏకగ్రీవం
మర్రిపాడు: ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనకు అవకాశం ఇవ్వడంతోనే తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని నెల్లూరు జిల్లా పరిపాల మండలంలోని డీసీపల్లి సర్పంచ్ దేవరాల గంగాధర్ యాదవ్ తెలిపారు.మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ దేవరాల గంగాధర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనపై నమ్మకం ఉంచి, సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. మంత్రి ఆశీస్సులతోనే,మార్గదర్శకత్వంతోనే గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైందని పేర్కొన్నారు.
తనకు అండగా నిలిచిన గ్రామ పెద్దలకు, ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని ఆయన హామీ ఇచ్చారు.




