Marripadu: రాజుపాలెంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మండలోత్సవాలు
Marripadu: నెల్లూరు జిల్లా రాజుపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయంలో మండలోత్సవాలు ఘనంగా జరిగాయి.
Marripadu: రాజుపాలెంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మండలోత్సవాలు
మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని రాజుపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయంలో మండలోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి విశేష పూజలు,వివిధ రకాల అభిషేకాలు,హోమాలు,అర్చనలు వైభవంగా నిర్వహించారు.
ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా,భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Next Story




