Marripadu: చిలకపాడులో సైన్స్ బస్సుయాత్రను ప్రారంభించిన ఉపాధ్యాయులు
Marripadu: మర్రిపాడు మండలం చిలకపాడులో సైన్స్ బస్సుయాత్ర ప్రారంభం. విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం.
Marripadu: చిలకపాడులో సైన్స్ బస్సుయాత్రను ప్రారంభించిన ఉపాధ్యాయులు
మర్రిపాడు: డాక్టర్ జి విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ సైన్స్ బస్సుయాత్రను నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిలకపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మారుతీ కేశవ్ కుమార్ రెడ్డి, శివరాంరెడ్డి, నరసింహులు, జన విజ్ఞాన వేదిక నాయకులు కే పోలయ్య, షేక్ రసూల్ బాషా, జయాకర్ రెడ్డి, వేణుగోపాల్ సైన్స్ బస్ ఇంచార్జి చక్రపాణి పాల్గొని బుధవారం జండా ఊపి బస్సును ప్రారంభించారు.
ఈ బస్సు గత మూడు నెలల నుంచి డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక సహకారంతో గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కలిగించేందుకు డిఇఓ పర్యవేక్షణలో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు జిల్లా సైన్ సెంటర్ ని మరియు సివి రామన్ సైన్స్ సెంటర్ పురావస్తు శాఖ మ్యూజియం ఇలాంటి ప్రదేశాలను చూపించడం జరిగింది.
సైన్స్ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ జి విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని కోరారు..




