Marripadu: మర్రిపాడులో యూటీఎఫ్ సభ్యత్వ నమోదు షురూ!

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో యూటీఎఫ్ (UTF) ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 18 Jun 2026 10:37 PM IST
Marripadu
X

Marripadu: మర్రిపాడులో యూటీఎఫ్ సభ్యత్వ నమోదు షురూ!

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు యూ.టి.ఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు పి. విజయభాస్కర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కే.సుధాకర్ మరియు జిల్లా కుటుంబ సంక్షేమ డైరెక్టర్ యు.తిరుపాలు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న యూ.టి.ఎఫ్ సంఘం పట్ల ఉపాధ్యాయుల్లో విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుండే యూ.టి.ఎఫ్ సంఘంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు సభ్యత్వాన్ని స్వీకరించి సంఘం పట్ల తమ విశ్వాసాన్ని చాటారని తెలిపారు.

సంఘం మరింత బలోపేతం కావడానికి ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వం తీసుకుని సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హెచ్. మోహన్ ప్రసాద్, టి.సి.వెంగయ్య, ఐ.భాస్కర్, ఎన్.సుబ్బరాయుడు, ఎన్.వెంకటేశ్వర్లు, కే. బాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story