Nellore: నెల్లూరు దొంగల ముఠా గుట్టురట్టు.. రూ.15 లక్షల బంగారం సీజ్!

Nellore: నెల్లూరు నగరంలో వరుస చోరీలతో కలకలం రేపిన ఇద్దరు ఘరానా దొంగలను చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 22 May 2026 9:31 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు దొంగల ముఠా గుట్టురట్టు.. రూ.15 లక్షల బంగారం సీజ్!

Nellore: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠా ఆట కట్టించారు నెల్లూరు పోలీసులు. నిందితుల నుంచి భారీ నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో చిన్నబజార్ పోలీసులు వరుస చోరీ కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.15.54 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు మరియు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందిస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story