District: అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల విస్తృత తనిఖీలు
District: ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో జిల్లాలో నాకాబంది, వాహన తనిఖీలు, లాడ్జి చెకింగ్స్ నిర్వహించారు.
District
District: జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణలో భాగంగా, ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాల తనిఖీ (Vehicle Checking) మరియు లాడ్జి చెకింగ్స్ ను మరింత కట్టుదిట్టం చేయాలని యస్.పి. ఆదేశించారు. IPL బెట్టింగ్, గంజాయి వినియోగం/అమ్మకాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
క్రికెట్ బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు నిర్మూలించేందుకు జిల్లా పోలీస్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
యస్.పి. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సూచనలతో, 10.05.2026 రాత్రి 09.00 నుంచి 11.00 గంటల వరకు జిల్లాలోని అన్ని కీలక ప్రాంతాలలో 230 మంది అధికారులు మరియు సిబ్బందితో కూడిన బృందం నాకా బంది నిర్వహించి, విస్తృతంగా వాహనాలు తనిఖీ చేయడం మరియు లాడ్జిలలో చెకింగ్స్ చేపట్టడం జరిగింది.
జిల్లాలోని కూడళ్ళు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు, ప్రవేశ-నిష్క్రమణ ప్రాంతాలు మరియు అనుమానాస్పద ప్రాంతాలలో మొత్తం 230 మంది అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పడి వాహనాల తనిఖీ మరియు లాడ్జి చెకింగ్స్‌ను విస్తృతంగా నిర్వహించారు.
ఈ నాకా బంది కార్యక్రమంలో భాగంగా:
జిల్లా వ్యాప్తంగా 87 లాడ్జీల్లో తనిఖీ నిర్వహించారు..
వాహనాల తనిఖీలలో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ - 41 కేసులు నమోదు చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ – 30 కేసులు నమోదు చేశారు .
MV యాక్ట్ కేసులు –404
మొత్తం రూ. 1,56.890/- జరిమానాలు విధించారు
రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలను మరింత కట్టుదిట్టం చట్టవిరుద్ధ కార్యక్రమంలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని యస్.పి. ఆదేశించారు.
లాడ్జి చెకింగ్స్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచి, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా పోలీసులు సమగ్ర తనిఖీలు నిర్వహించారు.
క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ కొనసాగిస్తూ, ఓపెన్ డ్రింకింగ్, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు వంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.
అంతర్జిల్లా సమన్వయంతో సమాచారం మార్పిడి చేసి, జిల్లా సరిహద్దుల్లో పటిష్టమైన వాహన తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి పెట్టారు.
ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, డయల్ 100/112 లేదా కంట్రోల్ రూమ్ 9392903143 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.




