Nellore: నెల్లూరులో కాకాణి మే డే గర్జన.. కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం!
Nellore: నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.
Nellore: నెల్లూరులో కాకాణి మే డే గర్జన.. కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం!
Nellore: శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు నిర్వహించారు , శాసన మండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి ,రూరల్ ఇంచార్జి ఆనం విజయకుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత,జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద, ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి కాకాణి. వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులతో కలిసి భారీ కేక్ కట్ చేసి, మునిసిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేసి, మేడే శుభాకాంక్షలు తెలిపారు కాకాణి. మే డే సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్మిక సోదరీ సోదరీమణులకు, మరియు కార్మిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు కాకాణి
కార్మికుల హక్కుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, కూటమి ప్రభుత్వం కార్మికులను వంచిస్తోందని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికుల పట్ల సమాజం సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. సమాజ ప్రగతికి, అభివృద్ధికి కార్మికులు చిందిస్తున్న స్వేదం మరియు వారి త్యాగాలు ఎంతో విలువైనవని తెలిపారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
నేడు మనం అనుభవిస్తున్న అభివృద్ధి వెనుక కార్మికుల కష్టం దాగి ఉంది వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మిక పక్షపాతిగా ఉంటుంది , వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని, 1886వ సంవత్సరంలో మొట్టమొదట చికాగోలో జరిగిన కార్మిక పోరాటం లో నాడు 10 నుండి 14 గంటల పని విధానాన్ని నిరసిస్తూ, 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం' అనే నినాదంతో కార్మికులు పోరాటాన్ని సాగిస్తే, నాయకులు పెడచెవిన పెట్టారని, పోరాటంలో జరిగిన దమనకాండలో ఎంతో మంది కార్మిక సోదరులు అసువులు బాసారని గుర్తు చేశారు.
కార్మికుల త్యాగాల ఫలితమే ప్రభుత్వాలు దిగివచ్చి నేడు ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఎనిమిది గంటల పని దినాలు అని అన్నారు. మే డే ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తిగా ర్యాలీలు జరిపి కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి, కార్మికులకు అవసరమైన చట్టాల గురించి మాట్లాడడం ,ప్రభుత్వాలకు విన్నవించడం ఆనవాయితీ అని, ప్రపంచవ్యాప్తిగా ప్రభుత్వాలు కార్మికులకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను మేడే రోజున ప్రకటించడం సాంప్రదాయం అని, కార్మిక లోకానికి అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరుకుంటున్నానని చెప్పారు .
కార్మికులకు పని దినాల విషయంతో పాటు వేతనాల చెల్లింపు, సంక్షేమ కార్యక్రమాలు ,తదితర విషయాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు కార్మికుల పట్ల అత్యంత సానుకూల వైఖరిని ప్రదర్శించారని, ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే స్పందించి ఆదుకున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను గతంలో అమ్మివేసి ,నేడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వం ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేయడం కార్మికుల ప్రయోజనాలకు విఘాతంకలుగుతుందని, దీనివల్ల కార్మికుల తొలగింపులు మరియు జీతాల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు .
దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ప్రమాదవశాత్తూ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల వరకు భారీ పరిహారాన్ని అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు మరియు ఇతర కార్మిక అంశాలపై ఎన్నో మాటలు చెప్పి,అధికారంలోకి వచ్చాక కార్మికులను మోసం చేయడం అలవాటుగా మారిందని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధితో అమలు చేశారని తెలిపారు. సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి, వారికి ఈ సందర్భంగా వస్త్రాలను పంపిణీ చేస్తున్న జయ కుమార్ రెడ్డిని అభినందిస్తున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో జయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తాం,కార్మికులందరికీ అండగా ఉంటాం అని అన్నారు.
కార్మికుల పక్షపాతిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని చెప్పారు. కార్మికులు లేనిదే నిర్మాణం లేదు, శ్రమ లేనిదే ప్రగతి లేదు. శ్రమ జీవులందరికీ మరొక్కసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
కాకాణి పూజిత మాట్లాడుతూ..
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. మే డే అంటే,ఎనిమిది గంటల పని దినం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునే రోజు అని, వృత్తి ఏదైనా, శ్రమను గౌరవించడం నేర్చుకోవాలని ఈ రోజు మనకు గుర్తు చేస్తుందని చెప్పారు. దేశ ప్రగతి చక్రం తిరగాలంటే కార్మికుడి చేయి కదలాల్సిందేనని, శ్రమైక జీవన సౌందర్యానికి ఇదే నా సెల్యూట్ అని అన్నారు. లోకంలో ఏ వస్తువూ ఊరికే రాదు, అది ఎవరో ఒకరి శ్రమ ఫలితంగా వస్తుందని చెప్పారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ట్రేడ్ యూనియన్ సభ్యులకు, కార్మికులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని, కార్మికులకు అండగా నిలిచింది జగనన్న ప్రభుత్వమే అని అన్నారు.
ప్రస్తుత కూటమి పాలనలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం లో కార్మికులకు సరైన గుర్తింపు, మద్దతు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న హయాంలో కార్మికులకు అన్ని విధాల మంచి జరిగిందని, రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే కార్మిక లోకానికి, ట్రేడ్ యూనియన్ కు మంచి రోజులు వస్తాయని చెప్పారు. అందరం కలిసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మళ్లీ మనకి జగనన్న స్వర్ణయుగం వస్తుందని చెప్పారు. కార్మిక సోదరులందరికి మరొకసారి మే డే శుభాకాంక్షలు తెలుపుతూ, వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు కాకాణి పూజిత.
ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ..
1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులపై జరిగిన దమనకాండను గుర్తుచేసుకుంటూ, కార్మికుల హక్కుల కోసం సాగిన పోరాట ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న మే డే అని పేర్కొన్నారు. కార్మికులకు అనుకూలమైన చట్టాలను రూపొందించడంలోనూ, వారి పని దినాలు మరియు వేతనాల విషయంలో ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ఉద్యమాల పాత్ర కీలకం అని అన్నారు. మేడే సందర్భంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు జై కుమార్ రెడ్డి దుస్తులు పంపిణీ చేయడం సంతోషం అని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు, కార్మికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ మరియు పార్టీ యంత్రాంగం అండగా ఉంటుందని చెప్పారు. కార్మికుల పక్షాన నిలబడటంలో నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.
బొందిగలపాడు జయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని గాలికొదిలేసిందని, కార్మిక వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు . ఎన్నికలకు ముందు కార్మికుల అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడతామని, భారీగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని చెప్పారు. ఉన్న పరిశ్రమలు కూడా స్థానిక నాయకుల దందాలు,అవినీతి వేధింపుల కారణంగా మూతపడే పరిస్థితి నెలకొంది,దీనివల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల వల్ల కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం లేదని చెప్పారు . గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత లభించిందని గుర్తు చేశారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి 1.20 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించారని, వాలంటీర్ వ్యవస్థ, ప్రభుత్వ మద్యం దుకాణాలు మరియు రేషన్ దుకాణాల ద్వారా దాదాపు 3 లక్షల మందికి పైగా ఉపాధి లభించిందని అన్నారు. జగన్ పాలనలో కార్మికుల బాగు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను తీర్చి ,పరిశ్రమల స్థాపన పై దృష్టి సారించాలని వైయస్సార్ ట్రేడ్ యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.




