Nellore: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు మేయర్ సుజాత!

Nellore: నెల్లూరు కార్పొరేషన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ సుజాత, కమిషనర్ వై.ఓ నందన్ అర్జీలు స్వీకరించి, ఆక్రమణలపై హెచ్చరించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 3 Aug 2026 11:42 PM IST
Nellore
X

Nellore: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు మేయర్ సుజాత!

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ నందన్ లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.

కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.... ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీలను పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కమిషనర్ వై.ఓ నందన్ మాట్లాడుతూ టిడ్కో గృహాలలో గృహాలు మంజూరు అయినప్పటికీ స్వాధీనం పొందక ఉన్న వాటిని అర్హులైన ఇతర లబ్ధిదారులకు కేటాయిస్తున్నామని, అర్హులైనవారు టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

స్థానిక పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం సుమారు 8 కోట్ల రూపాయలతో డివైడర్లు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అయితే దుకాణదారులు రోడ్డు ఆక్రమణలకు పాల్పడుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు.

ఇటీవల రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న రోడ్డు ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించి ప్రజా రవాణాకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. అదే విధంగా మినీ బైపాస్, ట్రంకు రోడ్డు ప్రాంతాలలో కూడా రోడ్డు ఆక్రమణలను నిరంతరం తొలగిస్తున్నామని, పొదలకూరు రోడ్డు ప్రాంతంలోని రోడ్డు ఆక్రమణలను గుర్తించి తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ తెలియజేశారు.

ప్రభుత్వ స్థలాలు, కార్పొరేషన్ స్థలాలు, ఇతర ఆర్ అండ్ బి రోడ్లను ఆక్రమించి ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టరాదని, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాలలో రోడ్డు విస్తరణ పనులను తప్పనిసరిగా చేపడతామని కమిషనర్ స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 43 , టౌన్ ప్లానింగ్ 09, రెవెన్యూ 04, ఇంజనీరింగ్ 10, అకౌంట్ సెక్షన్ 01, పబ్లిక్ హెల్త్ 01, ఆప్కాస్ 02, హెచ్ సెక్షన్ 01, పెన్షన్ 01 మొత్తం 72 వినతులను మేయర్, కమిషనర్ లు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ లు శేషగిరిరావు, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సతీష్, ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story