Nellore: నారాయణ' ఛారిటీస్.. నెల్లూరులో ఉచిత సైకిళ్ల పంపిణీ చేసిన మేయర్!

Nellore: వెంకటేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్‌లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం ఉచితంగా అందజేసిన సైకిళ్లను మేయర్ దేవరకొండ సుజాత పంపిణీ చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 3 Aug 2026 10:24 PM IST
Nellore
X

Nellore: నారాయణ' ఛారిటీస్.. నెల్లూరులో ఉచిత సైకిళ్ల పంపిణీ చేసిన మేయర్!

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 53వ, 54వ డివిజన్లకు చెందిన వెంకటేశ్వరపురం నగరపాలక సంఘ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం అందించిన ఉచిత సైకిళ్లను విద్యార్థులకు ఘనంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత మరియు మాజీ కార్పొరేటర్ దేవరకొండ అశోక్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మేయర్ దేవరకొండ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాభ్యాసం మరింత సులభంగా కొనసాగేందుకు మంత్రి నారాయణ కుటుంబం అందిస్తున్న సహాయం అభినందనీయమని తెలిపారు. సైకిళ్లు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, ప్రతిరోజూ పాఠశాలకు సమయానికి చేరుకునేలా దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం మాజీ కార్పొరేటర్ దేవరకొండ అశోక్ మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు కోసం మంత్రి నారాయణ కుటుంబం చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సైకిళ్లు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి నారాయణ కుటుంబానికి, మేయర్ దేవరకొండ సుజాతకు, మాజీ కార్పొరేటర్ దేవరకొండ అశోక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story