Nellore: నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షల వెల్లువ!
Nellore: నెల్లూరు నగర మేయర్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించిన పి. రూప్ కుమార్ యాదవ్‌కు జేమ్స్ గార్డెన్‌లోని కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన దార్ల వెంకటేశ్వర్లు.
Nellore: నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షల వెల్లువ!
Nellore: నెల్లూరు నగర మేయర్‌గా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన పి. రూప్ కుమార్ యాదవ్‌ను పలువురు ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా జేమ్స్ గార్డెన్‌లోని ఆయన కార్యాలయానికి చేరుకున్న దార్ల వెంకటేశ్వర్లు, వినీత్, కలికి శ్రీధర్ రెడ్డి మరియు వారి మిత్రబృందం రూప్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేక్ కట్ చేయించి తమ ఆనందాన్ని పంచుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన మేయర్‌గా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ నెల్లూరు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.




