Nellore: ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. డాక్టర్ అశోక్
Nellore: సంగం మండలం పెరమణా గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహణ. వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ అశోక్ సూచన.
Nellore: ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. డాక్టర్ అశోక్
Nellore: నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల పెరమణా గ్రామంలో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సుజాత ఆదేశాలతో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్ ఆధ్వర్యంలో పెరమణా గ్రామ నాయకులు పిట్టి.పట్టాభిరామిరెడ్డి సహకారంతో మెగా వైద్య శిబిరము,ఇంటింటి ఆరోగ్య సర్వే స్థానిక వైద్యాధికారి డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని వారి వారి ఆరోగ్య సమస్యలను తెలియపరచి తగిన చికిత్సలు పొందారు.
ఈ కార్యక్రమంలో భాగంగా త్రాగునీటి వనరులను పరీక్షించి నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు.జ్వర పీడితులకు రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ గ్రామస్తులు పనులను ఉదయం 10 గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల పైన చేసుకుని వడదెబ్బ భారి నుండి వడదెబ్బ నుండి రక్షించుకోవాలని తెలిపారు.
ఒకవేళ ఎవరైనా వడదెబ్బ బారిన పడినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు పంపించాలన్నారు. గ్రామస్తులు పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించుట ద్వారా వ్యాధుల నుండి తప్పించుకోగలరని తెలిపారు. ఈ కార్య క్రమాన్ని 104 సర్వీసెస్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్టాప్ ఆరోగ్య మేరీ,జలీల్ అహ్మద్ ,ఎంఎల్ హెచ్పి లు ,హెల్త్ అసిస్టెంట్స్. ల్యాబ్ టెక్నీషియన్ ,ఏ ఎన్ ఎం లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




