Nellore: నెల్లూరు నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మే 10న భారీ జాబ్ మేళా!
Nellore: నెల్లూరులో మే 10వ తేదీన ఇంతియాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Nellore: నెల్లూరు నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మే 10న భారీ జాబ్ మేళా!
నెల్లూరు: "మెగా జాబ్ మేళా " ఇంతియాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మదీనా ఇంతియాజ్ నేతృత్వంలో, మే 10వ తేదీ, ఆదివారం రోజున నెల్లూరులోని పానకాల రాజ రోడ్డు, హల్తలీమ్ మసీదు వీధి వద్ద భారీ 'మెగా జాబ్ మేళా'ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మదీనా ఇంతియాజ్ మాట్లాడుతూ... ఈ మేళాలో KIA, TVS, Honda, Tata , J K Tyres వంటి అగ్రగామి సంస్థలతో పాటు మరో 15 ప్రముఖ కంపెనీలు నేరుగా పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని చెప్పారు.
కావున అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలు (డాక్యుమెంట్లు) మరియు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని నెల్లూరు యువత సద్వినియోగం చేసుకోవాలని, మదీనా ఇంతియాజ్ మీడియా సమావేశంలో తెలియజేశారు.




