Nellore: మేకపాటి సోదరుల మధ్య ఆస్తుల రగడ.. చంద్రశేఖర్ రెడ్డి ఫైర్!
Nellore: నెల్లూరు జిల్లాలో మేకపాటి సోదరుల మధ్య ఆస్తుల చిచ్చు. తన సోదరులు రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.
Nellore: మేకపాటి సోదరుల మధ్య ఆస్తుల రగడ.. చంద్రశేఖర్ రెడ్డి ఫైర్!
నెల్లూరు జిల్లా: ఉదయగిరి లో ప్రముఖ రాజకీయ కుటుంబం మేకపాటి సోదరుల మధ్య మరోసారి ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కింది రాద్ధాంతమవుతోంది ఉదయగిరి కి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రతినిత్యం వహించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఆస్తులు పంపకాలు చేయలేదంటూ ఇవాళ ఆయన నేరుగా మీడియా ముందు తన సొంత సోదరులపై ద్వజమెత్తారు. సోదరులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి,మరో సోదరుడు రాజగోపాల్ రెడ్డి లపై ఆరోపణలు గుప్పించారు.
ఇద్దరు భార్యలు ఉన్నారని ఆస్తులు పంచరా? ఎంతమందికి ఇద్దరు పెళ్ళాలు లేరు..? రాజులకే ఇద్దరు పెళ్లాలున్నారు? అంటూ చరిత్ర ను ఉంటాన్కించారు.నన్ను మోసం చేస్తారా ? మేకపాటి కుటుంబం రాజకీయం నిలబెట్టింది నేను, మీకోసం కొట్లాడింది నేను, ఉమ్మడి ఆస్తులు నాకు పంచకుండా మీరు ఎంతకాలం ఉంటారు. నా సహనం పరీక్షించవద్దు, ఇద్దరు పెళ్ళాలు ఉన్నవాళ్లు లేరా ? అన్నా? ఏమిటీ ఈ అన్యాయం అంటూ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన సొంత సోదరులు రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లను ప్రశ్నించారు. చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు మేకపాటి కుటుంబంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
లక్షల కోట్ల ఆస్తులు కలిగిన మేకపాటి కుటుంబం తన వాటా ఇవ్వడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు విమర్శలు ఇప్పుడు ఆ కుటుంబ రాజకీయ భవితవ్యం పైన ప్రభావం చూపుతోంది. గత శాసనసభ సమావేశాలకు సార్వత్రిక ఎన్నికలకు ముందు సోదరులతో విభేదించి ఆపై వైసిపి అజేనేతతో విభేదించి సోదరులకు ఎదురు తిరిగి చంద్రశేఖర్ రెడ్డి టిడిపి లో చేరారు సార్వత్రిక ఎన్నికల్లో ఉదయ్‌కిరణ్ నుంచి మరోసారి సీటు వస్తుందని భావించినప్పటికీ కూటమి పాలన అడ్జస్ట్మెంట్ లో చంద్రశేఖర్ రెడ్డికి టిడిపి నుంచి సీటు దక్కలేదు ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి రెండవ భార్య మేకపాటి శాంత కుమారి కి టిటిడి లో సభ్యులుగా ఆశించినప్పటికీ అది ఫలించలేదు చివరిగా శాంతి కుమారికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని ఇచ్చారు గత కొద్ది కాలంగా ఆస్తుల వ్యవహారంలో చంద్రశేఖర్ రెడ్డి సోదరుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం స్థానిక ఎన్నికల సమరం సన్నద్ధమవుతున్న వేళ చంద్రశేఖర్ రెడ్డి ఆస్తుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం ఇప్పుడు రాజకీయంగా చర్చిని అంశమైంది.




