Udayagiri: మారుతున్న వాతావరణం - ప్రకృతి వ్యవసాయమే శరణ్యం.. నిపుణుల వెల్లడి

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు ‘ప్రకృతి వ్యవసాయ స్వావలంబకుల శిక్షణ’ నిర్వహించారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 23 Jun 2026 8:05 PM IST
Udayagiri
X

Udayagiri: మారుతున్న వాతావరణం - ప్రకృతి వ్యవసాయమే శరణ్యం.. నిపుణుల వెల్లడి

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ స్వావలంబకుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ తరఫున దుత్తలూరులోని సామాజిక సాధికారిక మరియు ఆర్థిక అభివృద్ధి సంస్థ (సీడ్స్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ ప్రాంతీయ శిక్షణ సమన్వయకర్త సీహెచ్ రవిచంద్ర, జిల్లా పథక నిర్వాహకుడు కన్నయ్య విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ అందించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవలంబించాల్సిన వ్యవసాయ పద్ధతులు, ముఖ్యంగా తొలకరి సాగుకు ముందు 20 రకాల పచ్చిరొట్ట పంటలను సాగు చేసి భూసారాన్ని పెంపొందించే విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

భూములు నిస్సారంగా మారకుండా కర్బన శాతాన్ని పెంచడం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా కళాశాల వ్యవసాయ విస్తరణ శాఖ విభాగాధిపతి డాక్టర్ టి. గోపికృష్ణ, బోధన సహాయకురాలు డాక్టర్ పి. మాలిని పాల్గొన్నారు. సీడ్స్ సంస్థ ప్రతినిధులు కె. సతీష్, రసూల్, ప్రవీణ్, కె. నవీన్ సంస్థ నిర్వహిస్తున్న ఆర్థిక సాధికారత, నైపుణ్య శిక్షణ, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story