Nellore: ఆగస్టు 8 వరకు మూడు రాష్ట్రాల్లో అగ్రి విద్యార్థుల పర్యటన!

Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థుల దక్షిణ భారత విద్యా విహారయాత్ర ఆదివారం ప్రారంభమైంది.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 2 Aug 2026 9:18 PM IST
Nellore
X

Nellore: ఆగస్టు 8 వరకు మూడు రాష్ట్రాల్లో అగ్రి విద్యార్థుల పర్యటన!

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాల బీఎస్సీ (ఆనర్స్) వ్యవసాయం తృతీయ సంవత్సరం విద్యార్థుల దక్షిణ భారత విద్యా విహారయాత్ర నేడు ప్రారంభమైంది.

మొత్తం 70 మంది విద్యార్థులు ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను సందర్శించనున్నారు.ఈ పర్యటనలో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడి వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా సదుపాయాలను పరిశీలించనున్నారు.

భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో అవసరమైన నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవడమే ఈ విద్యా విహారయాత్ర ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.ఈ యాత్రలో 49 మంది విద్యార్థినులు, 21 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యా విహారయాత్రను కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి. గోపి కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story