Udayagiri: భర్త చంద్రశేఖర్‌రెడ్డికి అన్యాయం చేసింది కుటుంబ సభ్యులే!
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి జన్మదిన వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Udayagiri: భర్త చంద్రశేఖర్‌రెడ్డికి అన్యాయం చేసింది కుటుంబ సభ్యులే!
Udayagiri: మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సతీమణి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతికుమారి జన్మదిన వేడుకలు ఉదయగిరిలో అట్టహాసంగా జరిగాయి. అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ వేడుకల సందర్భంగా మేకపాటి శాంతకుమారి చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి.తన భర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి రాజకీయంగా జరిగిన అన్యాయంపై తాను వెనక్కి తగ్గేది లేదని శాంతకుమారి స్పష్టం చేశారు. తన భర్తను రాజకీయంగా దెబ్బతీసింది బయట వ్యక్తులు కాదని కుటుంబ సభ్యులేనని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శాంతకుమారి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.“బస్తీ మీ సవాల్ నేను ఒంటరిగా వస్తాను చర్చకు సిద్ధమా?” అంటూ ఆమె చేసిన సవాల్ ఇప్పుడు ఉదయగిరి రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను ఎవరికీ భయపడేది లేదని, తన భర్తకు జరిగిన అన్యాయంపై అవసరమైతే ఎంత దూరమైనా పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు.మేకపాటి కుటుంబంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాంతకుమారి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆయనకు ఎదురైన పరిణామాలు, కుటుంబంలో చోటుచేసుకున్న రాజకీయ విభేదాలను ప్రస్తావిస్తూ శాంతకుమారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.తన భర్తకు జరిగిన అన్యాయంపై ఒక భార్యగా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గబోనని శాంతకుమారి స్పష్టం చేశారు. తన పోరాటం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, తన భర్తకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబ రాజకీయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో శాంతకుమారి తాజాగా చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఆమె చేసిన “నేను ఒంటరిగా వస్తాను... చర్చకు సిద్ధమా?” అనే సవాల్‌పై ప్రత్యర్థి వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
శాంతకుమారి వ్యాఖ్యలతో ఉదయగిరి రాజకీయాల్లో మరోసారి మేకపాటి కుటుంబ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆమె వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి? మేకపాటి కుటుంబంలోని ఇతర నేతలు దీనిపై ఎలా స్పందిస్తారు? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
మొత్తానికి జన్మదిన వేడుకల వేదికగా మేకపాటి శాంతకుమారి చేసిన సంచలన వ్యాఖ్యలు ఉదయగిరి రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. “బస్తీ మీ సవాల్... నేను ఒంటరిగా వస్తాను చర్చకు సిద్ధమా?” అంటూ ఆమె విసిరిన సవాల్‌కు సమాధానం ఎవరి నుంచి వస్తుందన్నదే ఇప్పుడు ఉదయగిరి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




