Nellore: కత్తిపోట్ల బాధితుడికి మేకపాటి శాంతికుమారి చేయూత

Nellore: ఒంగోలు కిమ్స్ హాస్పిటల్‌లో కత్తిపోట్లకు గురైన ఏవీఎస్ ($AVS$) జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ను పరామర్శించిన మేకపాటి శాంతి కుమారి.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 4 Jun 2026 2:20 PM IST
Nellore
X

Nellore: కత్తిపోట్ల బాధితుడికి మేకపాటి శాంతికుమారి చేయూత

నెల్లూరు: ఇటీవల ఒంగోలులో కత్తిపోట్లకు గురై కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి సంఘ నాయకుడు.. కోమిటిగుంట్ల శివకుమార్ కు నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంత కుమారి చేయూతనిచ్చారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి సంఘ నాయకునికి ఆర్థిక తోడ్పాటు అందించారు.

వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.చికిత్స పొందుతున్న శివకుమార్ ను ఆమె పరామర్శించారు. హాస్పిటల్ ఖర్చులకోసం ఆర్థికసాయంగా రెండు లక్షల రూపాయల చెక్కు అందజేశారు మేకపాటి శాంతి కుమారి... ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి నాయకుడు శివ స్వస్థలం

ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం, పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోమటిగుంట్ల శివ కందుకూరు లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతు ఆంధ్ర విద్యార్థి సంఘం AVS ఒంగోలు జిల్లా అధ్యక్షులు గా పని చేస్తున్నారు.శనివారం జరిగిన కత్తి దాడిలో తీవ్ర గాయాలు పాలై ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శివ ని పరామర్శించి,వారి కుటుంబానికి ధైర్యం చెప్పి 2లక్షలు రూపాయలు చెక్కు అందజేసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి. వీరితోపాటు ఆంధ్ర

విద్యార్థి సంఘం AVS రాష్ట్ర అధ్యక్షులు మల్లవరపు అశోక్ రెడ్డి,ఒంగోలు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్,విద్యార్థి నాయకులు మోహన్, నాయబ్,బాలు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam

Next Story