Udayagiri: కోదండరాముని ఆలయ నిర్మాణానికి మేకపాటి శాంతి కుమారి హామీ

Udayagiri: ఉదయగిరి యాదవ్ వీధిలో నిర్మాణంలో ఉన్న శ్రీ కోదండరాముని ఆలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతి కుమారి సందర్శించి, పంచలోహ విగ్రహాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 24 Aug 2026 9:07 PM IST
Udayagiri
X

Udayagiri: కోదండరాముని ఆలయ నిర్మాణానికి మేకపాటి శాంతి కుమారి హామీ

ఉదయగిరి: ఉదయగిరి పట్టణంలోని యాదవ్ వీధిలో నిర్మాణంలో ఉన్న శ్రీ కోదండరాముని ఆలయాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతి కుమారి సందర్శించారు.

యాదవ్ వీధి యువత, స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.ఆలయ నిర్మాణానికి సహకరించాలని స్థానికులు కోరగా, ఆలయానికి పంచలోహ ఉత్సవ విగ్రహాలు అందజేసి, శ్రీ కోదండరాముని కల్యాణం నిర్వహిస్తామని శాంతి కుమారి హామీ ఇచ్చారు.

దైవ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తనతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శక్తి మేరకు సహాయం అందిస్తారని తెలిపారు. శ్రీ కోదండరాముని సేవలో భాగస్వామ్యం కల్పించిన యాదవ్ వీధి యువత, స్థానికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ్ వీధి యువత, స్థానికులు పాల్గొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story