Nellore: పొగాకు రైతులకు రూ.350 ఇవ్వాల్సిందే: మేకపాటి విక్రమ్ రెడ్డి డిమాండ్!

Nellore: నెల్లూరు జిల్లా పొగాకు రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి డిమాండ్. గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిక.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 26 May 2026 4:44 PM IST
Nellore
X

Nellore: పొగాకు రైతులకు రూ.350 ఇవ్వాల్సిందే: మేకపాటి విక్రమ్ రెడ్డి డిమాండ్!

Nellore: నెల్లూరు లోని డిసీపల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాలలో కిలో పొగాకుకు ధర గరిష్ఠంగా 350 రూపాయలు ఇచ్చి పొగాకు రైతులకు నష్టం జరగకుండా చూడాలనీ మాజీ ఎమ్మెల్యే ఆత్మకూరు నియోజకవర్గం వైసిపి ఇంఛార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేయడంతో పాటుగా గిట్టుబాటు ధర కల్పించి పొగాకు రైతులని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలను మేకపాటి విక్రమ్ రెడ్డి కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కిలో పొగాకు ధర 280 నుండి ప్రారంభమై 350 వరకు వచ్చాయని తెలిపారు. అయితే ఈ సంవత్సరం గతం కంటే దారుణంగా కిలో పొగాకు 250 రూపాయలు నుండి ప్రారంభమై 180 వరకు తగ్గిపోయిందని దీంతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం ద్వారా ఐటిసికి పొటీ పడి ఇతర కంపెనీలు పొగాకు కొనుగోలు చేశాయన్నారు.

జగనన్న 5 సంవత్సరాల కాలంలో పొగాకు రైతులు అత్యధిక లాభాలతో సుఖసంతోషాలుతొ ఉన్నారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు అంటే ఎప్పుడు చిన్నచూపని అందుకే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయకపోవడంతో ఐటిసి కంపెనీకి ఎదురు లేదని భావించి ఐటిసి ప్రతినిధులు పొగాకు కొనుగోళ్లు అడ్డగోలు రేట్లుపెట్టి కొనుగోలు చేయడం ద్వారా పొగాకు రైతులు కుదేలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాక పొగాకు కొనుగోళ్లు నత్తనడక సాగుతుందని తద్వారా పొగాకు నాణ్యత క్షీణించి రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని అలా జరుగకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు వెంటనే కలుగజేసుకుని పొగాకు కొనుగోలు వేగవంతం చేసి రైతులని ఆదుకోవాలని కోరారు.

ప్రస్తుతం పెట్టుబడులు భారీగా పెరిగి ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులకు కిలో ధర గరిష్టంగా 350 రూపాయలు కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలని మేకపాటి విక్రమ్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పొగాకు రైతులతో కలసి ఆందోళన చేసేందుకు వెనుకాడబోమని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story