Marripadu: ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎమ్‌లతో ఎంఈఓల అత్యవసర భేటీ!

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 24న జరగనున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) ఏర్పాట్లపై హెచ్‌ఎమ్‌లతో సమీక్షించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 22 July 2026 10:54 PM IST
Marripadu
X

Marripadu: ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎమ్‌లతో ఎంఈఓల అత్యవసర భేటీ!

మర్రిపాడు: మెగా పేరెంట్,టీచర్ మీటింగ్‌ (మెగా పీ.టీ.ఎం) నిర్వహణపై నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల విద్యాశాఖ కార్యాలయంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఈ నెల 24వ తేదీన మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా పీ.టీ.ఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రధానోపాధ్యాయులతో చర్చించారు.

ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు తిరుపతయ్య,ధనలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసినప్పుడే విద్యార్థులలో మెరుగైన విద్యా ఫలితాలతో పాటు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.మెగా పీ.టీ.ఎం కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు,పాఠశాల అభివృద్ధికమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు,పూర్వ విద్యార్థులు,విద్యాభిమానులు,స్థానిక ప్రముఖులను భాగస్వాములను చేయాలని సూచించారు.

ప్రతి పాఠశాలలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి,తల్లిదండ్రులకు సమాచారం అందించి,వారు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.అలాగే పాఠశాలల అభివృద్ధి,విద్యార్థుల భవిష్యత్తు,ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను స్వీకరించి,వాటిని పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

మెగా పీ.టీ.ఎం ద్వారా పాఠశాల మరియు తల్లిదండ్రుల మధ్య మరింత బలమైన అనుబంధం ఏర్పడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మండలంలోని అన్ని పాఠశాలల్లో మెగా పీ.టీ.ఎం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story