Nellore: నెల్లూరు మెడికవర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కీలక మైలురాయి!
Nellore: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్‌లో అధునాతన 'ట్యూమర్-మార్కర్ క్లిప్' విధానం విజయవంతం. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కీలక మైలురాయి సాధించిన వైద్యులు.
Nellore: నెల్లూరు మెడికవర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కీలక మైలురాయి!
Nellore: బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆసుపత్రికి చెందిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ నెరెల్ల కృష్ణ తేజ ఆధ్వర్యంలో ‘ఇమేజ్-గైడెడ్ ఇంట్రాలెషనల్ బ్రెస్ట్ ట్యూమర్-మార్కర్ క్లిప్ ప్లేస్‌మెంట్’ విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఖచ్చితమైన గుర్తింపు శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే కీమోథెరపీ వల్ల ట్యూమర్ సైజ్ తగ్గిపోయినా లేదా పూర్తిగా కనిపించకుండా పోయినా, క్లిప్ సహాయంతో ట్యూమర్ ఉన్న అసలు స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు.
మెరుగైన సర్జరీ ఇది శస్త్రచికిత్సను మరింత సులభతరం చేయడమే కాకుండా, బ్రెస్ట్-కన్సర్వింగ్ సర్జరీ (రొమ్మును కాపాడే శస్త్రచికిత్స)కి ఎంతో దోహదపడుతుంది.మెరుగైన సమన్వయం రేడియాలజిస్ట్, ఆంకాలజిస్ట్, బ్రెస్ట్ సర్జన్ల మధ్య సమర్థవంతమైన సమన్వయానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ తేజ మాట్లాడుతూ, ఈ చిన్న క్లిప్ ప్లేస్‌మెంట్ చికిత్స ప్రణాళికలో ఖచ్చితత్వాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది




