Marripadu: ఆవును తప్పించబోయి బోల్తా పడ్డ మినీ ట్రక్కు.. ఒకరు బలి!
Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద ఘోర ప్రమాదం. ఆవును తప్పించబోయి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది.
Marripadu: ఆవును తప్పించబోయి బోల్తా పడ్డ మినీ ట్రక్కు.. ఒకరు బలి!
మర్రిపాడు: నెల్లూరు జిల్లాలో ఏర్పేడు- దోర్నాల- నకిరేకల్ జాతీయ రహదారి రక్త మోడింది. మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న మినీ ట్రక్కు బోల్తా పడింది. ఘటనలో 16 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. కడప జిల్లా కాజీపేట లో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామమైన కలువాయి మండలానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళుతున్న మినీ ట్రక్కు ఆటో కి హఠాత్తుగా ఆవు అడ్డు రావడంతో డ్రైవర్ బేకు వేశాడు.
దాంతో మినీ ట్రక్కు బోల్తాకు పడినట్లు బాధితులు చెబుతున్నారు. సంఘటన అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆత్మకూరు వైద్య సేవలకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది బాధ్యత కుటుంబాలకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మర్రిపాడు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.




