Nellore: మంత్రి ఆనం చేతుల మీదుగా నరసింహకొండ అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Nellore: నెల్లూరు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైభవానికి రూ.8.74 కోట్లతో మహా అభివృద్ధికి భూమి పూజ చేసిన దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
Nellore: మంత్రి ఆనం చేతుల మీదుగా నరసింహకొండ అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
నెల్లూరు: నెల్లూరు రూరల్ నరసింహకొండలో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి .8.74 కోట్ల సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయాన్ని మరింత దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరురూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, శ్రీ కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి నరసింహకొండలో రూ.8.74 కోట్ల సీజీఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.జిల్లాలోని భక్తులకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆలయ అభివృద్ధికి బృహత్తర కార్యాచరణ రూపొందించారు.
ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచే విధంగా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో పాటు నెల్లూరురూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిల ప్రత్యేక కృషితో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
భవిష్యత్‌లో నరసింహకొండను మరింత సుందరంగా, ఆధ్యాత్మికంగా, భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు తెలిపారు.




