Atmakur: మంత్రి ఆనం బర్త్డే వేడుకలు: 75 కేజీల కేక్ కటింగ్!
Atmakur: ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు. టిడిపి నేత మట్లి సురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో 350 మందికి వస్త్రదానం, అన్నదానం.
Atmakur: మంత్రి ఆనం బర్త్డే వేడుకలు: 75 కేజీల కేక్ కటింగ్!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నేత మాజీ అట్రాసిటీ కమిటీ మెంబర్ ఆత్మకూరు పట్టణ ఏ ఎస్ ఆర్ కాలేజ్ కరెస్పాండెంట్ మట్లి సురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ టిడిపి అధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి సూచనలతో మంత్రి ఆనం జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.. బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక సీఐ గంగాధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో ప్రసంగించారు.. ఈ సందర్భంగా 75 కిలోల భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
అనంతరం ఒకరికి ఒకరు కేకులు తినిపించుకొని మంత్రి ఆనంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మట్లీ సురేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బందికి కలిపి మొత్తం 350 మందికి నూతన వస్త్రాలను అందించారు.. అలాగే కార్యక్రమం వద్ద 1000 మందికి ఉచిత అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు..ఈ సందర్భంగా టిడిపి నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మకూరు అభివృద్ధి అంటే ఆనం అని టిడిపి నేతలు కొనియాడారు.
మట్లి సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే మన నేత ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఆత్మకూరు కోసం వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అందుకోసమే తన సొంత ఖర్చులతోనే ఈ పూర్తి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు... అంటూ తెలిపారు...ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు, అన్ని మండలాల కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.




