Nellore: ముస్లిం సోదరులందరికి బక్రీద్ శుభాకాంక్షలు.. మంత్రి ఆనం

Nellore: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 28 May 2026 10:55 AM IST
Nellore
X

Nellore: ముస్లిం సోదరులందరికి బక్రీద్ శుభాకాంక్షలు.. మంత్రి ఆనం

Nellore: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీక అయిన ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను ముస్లీం సోదరులందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేవుని పై విశ్వాసం ఉంచి సన్మార్గంలో జీవించాలని ఈద్ అల్ అదా తెలియజేస్తుందని, తమకు ఉన్నదాంట్లో నుంచి ఇతరులకు పంచి పెట్టే దాతృత్వ స్ఫూర్తిని బక్రీద్ కలుగజేస్తుందన్నారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ ఈ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలని,రాష్ట్ర ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story