Kanipakam: కాణిపాకంలో వినాయకసదన్ వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం
Kanipakam: కాణిపాకంలో రూ.14.74 కోట్లతో నిర్మించిన 108 గదుల 'వినాయకసదన్' భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
Kanipakam: కాణిపాకంలో వినాయకసదన్ వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం
Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్థానిక శాసన సభ్యులతో కలిసి స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకుల నుంచి వేదాశీర్వచనం స్వీకరించారు. భక్తుల సేవార్థం నూతనంగా నిర్మించిన “వినాయకసదన్ అకామిడేషన్ బిల్డింగ్”ను స్థానిక శాసన సభ్యులతో కలిసి ప్రారంభించారు. రూ.14.74 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వసతి గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది దేవాదాయ శాఖ... కొత్తగా నిర్మించిన బ్లాకుల్లో 108 గదులు, ఆధునిక సౌకర్యాలతో భక్తులకు మెరుగైన వసతి ఏర్పాటు చేశారు. రూ.2.10 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫర్నిచర్, టేక్ వుడ్ పడకలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో స్వామివారి ఫోటో ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించింది దేవస్థానం.
భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు మంత్రి ఆనం. కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రాజు, దేవస్థానం పాలకమండల సభ్యులు దేవదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు.
అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ..
ప్రస్తుతం రాష్ట్రంలో 52 ఆలయాలలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని 116 ఆలయాలలో విస్తరింప చేయడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో, త్వరలో గోదావరి పుష్కరాలు , కృష్ణ పుష్కరాలు నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పురాతనమైన దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అర్ధగిరి, మొగిలి ఆలయము టూరిస్ట్ హబ్ గా అభివృద్ధిగా చేయడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.
కాణిపాక ఆలయమున విస్తృతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని, అరగొండ చౌడేశ్వరాలయం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి, అపోలో దాతల సహకారంతో, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో త్వరలో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వివిధ ఆలయాలలో106 ఈవో పోస్టులు ఏపీపీఎస్ ద్వారా పరీక్షలు నిర్వహించి భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్నామని, వివిధ ఆలయాలలో పని చేసే ఉద్యోగస్తులకు వేతనాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మంత్రి ఆనం.




