Nellore: నెల్లూరులో మహానాడు వేదికల పరిశీలన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Nellore: నెల్లూరులో జరగనున్న తెలుగుదేశం పార్టీ 'మహానాడు' నిర్వహణకు గాను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి స్థలాలను పరిశీలించారు.
Nellore: నెల్లూరులో మహానాడు వేదికల పరిశీలన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సంబంధించి నెల్లూరు కోవూరు జాతీయ రహదారి సమీపంలో ఇఫ్కో భూములు, రేగడి చెలిక వద్ద 110 ఎకరాల స్థలాలను పరిశీలించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు.
ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు స్థలాలను పరిశీలిస్తున్నామని, రాజుపాలెం సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్, బొడ్డువారిపాలెం వద్ద 110 ఎకరాల స్థలాలను పరిశీలిస్తున్నామని.. నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా స్థలాలను పరిశీలిస్తామని చెప్పారు... స్థలాలను పరిశీలించిన అనంతరం కేంద్ర పార్టీకి వివరాలను తెలియజేస్తామని, కేంద్ర పార్టీ టీం మరొకసారి పరిశీలించి అన్నిటికీ అనువైన స్థలాన్ని ఫైనల్ చేస్తారని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.




