Atmakur: ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన రూ.14.90 కోట్ల పనులకు శంకుస్థాపన

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 19 Jun 2026 5:34 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన రూ.14.90 కోట్ల పనులకు శంకుస్థాపన

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీలోని పేరారెడ్డిపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద 14.90 కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు రూ.8.98 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అలాగే 2.0 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం (WTP), 750 కిలోలీటర్ల సామర్థ్యంతో GLSR నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా 1,500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

ముఖ్యంగా బలహీన వర్గాల కాలనీల అభివృద్ధికి రూ.3.87 కోట్లతో మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేసామన్నారు. 1,471 గృహాలకు తాగునీటి కనెక్షన్లు కల్పించడంతో పాటు కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే ఆత్మకూరు చెరువు పునరుద్ధరణకు రూ.2.10 కోట్లతో ప్రత్యేక పనులు చేయనున్నట్లు తెలిపారు.

గతంలో 8 కోట్లతో ఆత్మకూరు బైపాస్ 4 లైన్ల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంగా పలు ఆటంకాల నేపథ్యంలో పనులు నిలిచిపోయాయని మరల పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇవి కాకుండా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు నిర్మాణానికి మరో 2 కోట్లు మంజూరయ్యాయని... త్వరలో పనులను ప్రారంభిస్తామని అన్నారు. ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆత్మకూరు మున్సిపాలిటీని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తున్నామని తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story