Nellore: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మూడు రోజుల పర్యటన!
Nellore: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.
Nellore: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మూడు రోజుల పర్యటన!
Nellore: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కావలి, కందుకూరు, చేజర్ల, ఆత్మకూరు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.ఈ సందర్భంగా విద్య, దేవాదాయ, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జూలై 4 (శనివారం): ఉదయం 8.30 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరి 9.30 గంటలకు కావలికి చేరుకుని, జమ్మలపాలెంలోని కేవీఆర్ కన్వెన్షన్ హాల్‌లో పీబీఆర్ విశ్వోదయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారితో కలిసి VITS గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం కందుకూరు లో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
జూలై 5 (ఆదివారం): ఉదయం చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు, చేజర్ల, చిత్తలూరు గ్రామాల్లో పర్యటిస్తారు.
ఈ సందర్భంగా పెరుమాళ్ళపాడు లో రూ1.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ నాగేశ్వరస్వామి, రూ.2 కోట్ల రూపాయలతో చేజర్ల మరియు చిత్తలూరు శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సీసీ రోడ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.అనంతరం నెల్లూరుకు చేరుకుని సాయంత్రం 5 గంటలకు వి.పి.ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో సీనియర్ పాత్రికేయులు మాశర్మ రచించిన "వెంకయ్య నాయకుడు " పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారితో హాజరవుతారు.
జూలై 6 (సోమవారం): సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలో పర్యటించి రెండు కోట్ల మేరకు వెచ్చించి పూర్తి చేసిన పనులను....నూతన జెడ్పీ హైస్కూల్ భవనం ప్రారంభోత్సవం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, పశువుల షెడ్ల ప్రారంభం, శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.




