Atmakur: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెండు రోజుల పర్యటన!
Atmakur: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
Atmakur: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెండు రోజుల పర్యటన!
ఆత్మకూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల 27, 28 తేదీల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జూలై 27 (సోమవారం) ఉదయం నెల్లూరు నుంచి బయలుదేరి ఆత్మకూరు ముస్తాపురం వార్డు-1కు చేరుకుని రూ.17 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ డ్రెయిన్, రూ.5 లక్షలతో నిర్మించిన మరో సీసీ డ్రెయిన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రచ్చబండ వద్ద మీడియా సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడనున్నారు.
జూలై 28 (మంగళవారం) ఉదయం అనంతసాగరం మండలం సోమశిల గ్రామానికి చేరుకుని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న శ్రీ మాతమ్మ ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే రూ.1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి, ఎన్డీఏ ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ప్రజలకు వివరించే ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం అనంతసాగరం మండలం పాతలపల్లి గ్రామంలో ఎఫ్‌డీఆర్ కింద రూ.35 లక్షలతో చేపట్టనున్న ఐదు సాగునీటి పనులకు భూమిపూజ నిర్వహిస్తారు. అనంతరం శ్రీ భద్రకాళమ్మ ఆలయాన్ని సందర్శించి, శ్రీ మాల ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి, గ్రామస్థులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. కార్యక్రమాల అనంతరం నెల్లూరుకు తిరిగి చేరుకుంటారు.




