Nellore: నెల్లూరులో లంబోదర గణపతిని దర్శించుకున్న మంత్రి ఆనం!

Nellore: నెల్లూరులో లంబోదర గణేశ్ మహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు.

A Praveen, Nellore
Published on: 18 Sept 2026 1:38 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో లంబోదర గణపతిని దర్శించుకున్న మంత్రి ఆనం!

Nellore: నగర నడిబొడ్డున అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న లంబోదర గణేశ్ మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి లంబోదర గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకున్న మంత్రి ఆనం రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

భారీ ఎత్తున నిర్వహిస్తున్న లంబోదర గణేశ్ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చక్రవర్ధన్ రెడ్డి, మదన్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore