Nellore: ప్రమాదంలో గాయపడిన ఐఏఎస్ అధికారి కుటుంబానికి మంత్రి పరామర్శ!
Nellore: నెల్లూరు జిల్లా చాపురాళ్లపల్లి NH-565 ప్రమాదంలో గాయపడిన తెలంగాణ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించారు.
Nellore: ప్రమాదంలో గాయపడిన ఐఏఎస్ అధికారి కుటుంబానికి మంత్రి పరామర్శ!
నెల్లూరు జిల్లా: అనంతసాగరం మండలం చాపురాళ్లపల్లి వద్ద జాతీయ రహదారి నం 565 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారి కుటుంబ సభ్యులు గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తక్షణమే స్పందించి, ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, గాయపడిన వారికి అందిస్తున్న అత్యవసర వైద్య చికిత్సను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.
వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం, అవసరమైన అన్ని వైద్య సేవలను తక్షణమే అందించాలని సూచించారు. అనంతరం మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




