Nellore: నెల్లూరు జిల్లాలో పడవ ప్రమాదం.. మంత్రి నారాయణ దిగ్భ్రాంతి!

Nellore: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం తాటిచెట్లపాలెం తీరంలో జరిగిన పడవ ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 27 May 2026 6:16 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో పడవ ప్రమాదం.. మంత్రి నారాయణ దిగ్భ్రాంతి!

Nellore: మత్స్యకారుల మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరులో సముద్రపు ఈదురు గాలుల బీభత్సంతో, ప్రమాదవశాత్తు ఇద్దరు మత్స్యకారులు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జరిగిన పడవ ప్రమాదంపై రాష్ట్ర మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోగోలు మండలం తాటిచెట్లపాలెం తీరంలో బోటు బోల్తా పడి, ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటనపై ఆయన వెంటనే స్పందించారు. ప్రమాద వివరాలను స్థానిక కావలి ఎమ్మెల్యే కృష్ణా రెడ్డితో పాటు, సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు.సముద్రంలో వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తూపిలి బాల మురళి, కుమారి గోవిందు కుటుంబాలకు మంత్రి నారాయణ తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఈ కష్టసమయంలో ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story