Nellore: స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం దక్కించుకున్న ఆత్మకూరు ఆసుపత్రి!

Nellore: ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం అందుకున్న ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్, వైద్యులు, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 14 Nov 2026 11:30 AM IST
Nellore
X

Nellore: స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం దక్కించుకున్న ఆత్మకూరు ఆసుపత్రి!

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం లభించడం పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాన్ని అందుకున్న ఆత్మకూరు జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆసుపత్రి సిబ్బందిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ద్వారా ఈ పురస్కారాన్ని సాధించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.

ఇదే స్ఫూర్తితో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలను మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి ఆనం ఆకాంక్షించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)