Nellore: మంత్రి ఆనం పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Nellore: నెల్లూరు జిల్లా చిరమన గ్రామంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటించారు.
Nellore: మంత్రి ఆనం పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
నెల్లూరు: ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అలాగే విపిఆర్ నేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు.
కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకుని అవసరమైన కళ్లద్దాలు పొందాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఉచితంగా ఏర్పాటుచేసిన ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు.




